మెల్‌బోర్న్ : కరోనా వైరస్ నేపథ్యంలో ఆసీస్ ఆటగాళ్లు ఐపీఎల్-13వ సీజన్‌కు రాకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా వివిధ ఐపీఎల్ ప్రాంచైజీలతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిసింది. కాగా ఈ విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ప్రమేయం ఏమీ లేదని చెబుతున్నారు. 'ఐపీఎల్‌లో ఆడాలా? వద్దా? అనేది పూర్తిగా వారి వ్యక్తిగత నిర్ణయం. ఆటగాళ్లు ఐపీఎల్‌తో వ్యక్తిగతంగా ఒప్పందం కుదుర్చుకున్నారన్న విషయం తమకు తెలుసు. కానీ ఈ విషయంలో తాము సలహా మాత్రమే ఇవ్వగలం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆటగాళ్లు సరైన నిర్ణయమే తీసుకుంటారననే మేము భావిస్తున్నాం' అని సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కెవిన్ రాబర్ట్స్ తెలిపాడు. మరోవైపు ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడేందుకు అనుమతి ఇవ్వాలా? లేక యూకేలో జరగనున్న హండ్రడ్ సిరీస్‌కు అనుమతి ఇవ్వాలా? అనే దానిపై క్రికెట్ ఆస్ట్రేలియా సమీక్ష నిర్వహించనుంది. (అలెక్స్ హేల్స్‌కు కరోనా సోకిందా?)
ఐపీఎల్‌కు ఆసీస్ ఆటగాళ్లు గుడ్ బై!