ఢిల్లీ అల్లర్లు: ఐదుగురు ఐపీఎస్‌ల బదిలీ

న్యూఢిల్లీ: ఢిల్లీ అల్లర్ల నేపధ్యంలో హోంశాఖ కీలక చర్యలు చేపట్టింది. ఇప్పటికే 22మంది ప్రాణాలు కోల్పోవడం.. అల్లరిమూకల తుపాకీ కాల్పుల్లో పదుల సంఖ్యలో గాయాలపాలు కావడంతో విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఐదుగురు ఎస్పీలపై బదిలీ వేటు వేసింది. కాగా సీఏఏ అనుకూల, ప్రతికూల నిరసనలతో రగిల్చిన చిచ్చుతో ఈశాన్య ఢిల్లీ అట్టుడుకుతోంది. ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఇప్పటిదాకా 20 మంది చనిపోగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున​ వారిలో మరో ఇద్దరు కూడా మరణించినట్లు తెలుస్తోంది. గాయపడ్డ వారిలో జీటీబీ ఆస్పత్రిలో ఒకరు, లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రిలో మరొకరు మృతి చెందడంతో మృతుల సంఖ్య 22కు చేరుకుంది.  చదవండి: ఢిల్లీ అల్లర్లపై స్పందించిన ప్రధాని